పింక్ స్లిప్ టెక్కీలు ఒక్కటైయితే... - MicTv.in - Telugu News
mictv telugu

పింక్ స్లిప్ టెక్కీలు ఒక్కటైయితే…

May 18, 2017

ట్రంప్ ఎఫెక్ట్ తో టెక్కీలకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్న ఐటీ కంపెనీలు భారత్ లో ఉద్యోగులకి పింక్ స్లిప్ లు ఇస్తున్నాయి.ఈ నేపథ్యంలో చేయీచేయీ కలిపి, ముందుకెళ్తేనే మనుగడ సాగించగలమనే ధోరణి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ లో వ్యక్తమవుతోంది.

తమిళనాడులోని కొందరు ఐటీ ఉద్యోగులు తమకు పింక్ స్లిప్‌లు ఇచ్చిన కాగ్నిజెంట్‌పై వారం క్రితం కంప్లయింట్ చేశారు. మరోవైపు దేశంలోనే తొలిసారిగా ఐటీ ఉద్యోగులు ఓ సంఘాన్ని తీసుకొచ్చేలా రెడీ అవుతున్నారు. ‘ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్’ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 100 మందికి పైగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ సంతకాలు చేశారు. ఐటీ సంస్థలు భారతదేశ చట్టాలను అమలు చేసేవిధంగా తాము కృషి చేస్తామన్నారు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, ఉద్యమకారిణి పి. పరిమళ . మహిళల భద్రత, సభ్యుల హక్కుల పరిరక్షణ కోసం కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.

అయితే తమిళనాడులోని నాలుగున్నర లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్‌లో చాలా మంది ఇలా సంఘంగా ఏర్పడేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. సంఘంలో చేరితే కంపెనీల మేనేజ్ మెంట్లు తమని ఇబ్బందులు పెడుతాయని భయపడుతున్నారట.

HACK:

  • With the effect of Trump IT employees are planning to start an organisation with the name Forum For IT Employees against by receiving pink slips from software companies.