పెళ్లి కూతురిని వివస్త్రను చేసి పరీక్షించారు
అనుమానం ఎంత నీచానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. పెళ్లి కాకముందే చెప్పుడు మాటలు విని వధువుని అవమానించాడో శాడిస్ట్ వరుడు.
ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జైహింద్ కి, తీజా అనే యువతికి పెళ్లి కుదిరింది. బంధుమిత్రులతో పెళ్లి జరుగుతున్న ప్రాంగణమంతా కళకళలాడుతోంది. ఇంతలో పెళ్లి కొడుకు నాకీ పెళ్లి వద్దని చెప్పి అందరికీ షాకిచ్చాడు. పెళ్లి కూతురికి బొల్లి వ్యాధి ఉందని, అందుకే తనకీ పెళ్లి వద్దని చెప్పాడు. అలాంటి వ్యాధి తనకు లేదని, తాను సంపూర్ణ ఆరోగ్యవంతురాలినని వధువు చెప్పినా వినిపించుకోలేదు. ఆమె తల్లిదండ్రులు బతిమిలాడినా పట్టించుకోలేదు.
పెళ్లి కూతురు కుటుంబం అంటే గిట్టని వ్యక్తి పెళ్లికొడుకు చెవిలో ఈ అబద్దాన్ని చెప్పాడు. దాన్ని నిజమని నమ్మి పెళ్లి కొడుకుతో పాటు, అతని కుటుంబ సభ్యులు కూడా నానా హంగామా చేశారు. చివరకు ఈ పంచాయితీ పోలీసుల దగ్గరకు చేరింది. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడిన పోలీసులు ఆమె శరీరంపై మచ్చలు ఉన్నాయో, లేదో పరీక్షించుకోవాలని సలహా ఇచ్చారు. పెళ్లి కొడుకు బంధువులు తీజాను ఓ రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెను వివస్త్రను చేసి పరీక్షించారు. ఆమె ఒంటిపై ఎలాంటి మచ్చలు లేకపోవడంతో అదంతా అబద్ధమేనని తేలింది. దీంతో పెళ్లి కొడుకు, అతని బంధువులు వధువుకు, ఆమె కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. చివరకు తలదించుకుని పెళ్లికూతురి మెడలో మూడు ముళ్లు వేశాడు.
HACK:
- Bridegroom rejected to marry bride due to a rumor spread by unknown that she has a skin disease.
- He examined her by removing her clothes, then he came to know that news is a rumor.