పోలీసుల పనితనం చూపించుకుని.. జీహెచ్ఎంసీలో 99 సీట్లు గెలిచాం..! - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసుల పనితనం చూపించుకుని.. జీహెచ్ఎంసీలో 99 సీట్లు గెలిచాం..!

May 19, 2017

పోలీసుల పనితనం చూపించుకుని.. జీహెచ్ఎంసీలో 99 సీట్లు గెలిచామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోలీసుల మంచి పనితనం వల్లే జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో ఓట్లు అడుగగలిగామని స్పష్టం చేశారు. తెలంగాణాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉండటం వల్లనే తాను ఇతర అంశాలపై దృష్టి సారించగలుగుతున్నానని కేసీఆర్ చెప్పారు. ఈ విషయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డితోపాటు పోలీసులకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుంచి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. కేసీఆర్ మహిళా పోలీసులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు … దీనికవసరమైన సొమ్మును ప్రభుత్వమే మంజూరు చేస్తుందని కేసీఆర్‌ చెప్పారు. అలాగే ప్రమోషన్లు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిందేనని, దానికి అవసరమైన జాబితాలు తయారు చేసి పైరవీలకు, మెహర్బానీలకు ఆస్కారం లేకుండా ఇచ్చేయాలని ఆదేశించారు. ఎస్సై, సీఐ ఎప్పుడూ అప్‌డెట్ అయి ఉండాలని సూచించారు. నేను చెప్పేది రైట్ అని మీరంటార‌నుకుంటాన‌ని సీఎం అన్నారు. జోన్ల స‌మ‌స్య‌ను స్ట్రీమ్‌లైన్ చేయాల‌న్నారు. డిపార్ట్‌మెంట్ హెడ్స్‌కు ప్ర‌మోష‌న్ త‌ప్ప‌క ఇవ్వాలన్నారు. ప్ర‌మోష‌న్ త‌గిన స‌మ‌యానికి ఇస్తే అదే బెస్ట్ రిఫార్మ్ అవుతుందన్నారు. అలా చేస్తే డ్యూటీ గురించి ఆలోచించాల్సిన ఇబ్బంది ఉండ‌ద‌న్నారు. ప్ర‌మోష‌న్ల‌ అంశంపై ప్ర‌భుత్వం స‌హ‌కారం ఉంటుంద‌న్నారు.
పోలీసు శాఖ‌కు 500 కోట్ల బ‌హూమానం ఇస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొత్త వాహ‌నాలు, మౌలిక స‌దుపాయాల కోసం ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేయాల‌న్నారు.