https://twitter.com/adrian_slabbert/status/1534791702170505216
mictv telugu

ప్రారంభించిన కాసేపటికే కూలిన వంతెన… వీడియో

June 9, 2022

నేటి తరం ఇంజినీర్లు కడుతున్న కొన్ని కట్టడాలను, వంతెనలను చూస్తుంటే ఆ మాత్రం గ్యారంటీ లేకుండా ఎలా కట్టారా? అనిపిస్తుంది. ఏమాత్రం నాణ్యత లేకుండా నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు ఇంజినీర్లు. దీనికి అవినీతి అధికారులు తోడవుతున్నారు. అయితే ఎంత అవినీతి చేసి నిర్మించినా ప్రజల తృప్తి కోసం కొద్ది రోజులైనా ఆయా నిర్మాణాలు బాగా ఉంటాయి. కానీ, వీడియోలోని వంతెన మాత్రం ఓపెన్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. అదీ ఓపెన్ చేసిన అధికారులు వెళ్తుండగా. దీంతో ఈ వీడియో నెటిజన్ల దృష్టిని తన వైపు తిప్పుకుంది. వివరాల్లోకెళితే.. మెక్సికో దేశంలో క్యూర్నావాకా నగరంలో ప్రజల సౌకర్యార్ధం అధికారులు ఓ పాద వంతెనను నిర్మించారు. అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జి అన్నమాట. దీని ప్రారంభోత్సవానికి నగర మేయర్ లాయిస్ ఉరియో స్టెగుయ్‌తో పాటు అధికారులు, స్థానిక ప్రజలు వచ్చారు. వంతెన ప్రారంభం కాగానే బోణీ చేద్దామనే స్టైల్లో మేయర్‌తో పాటు అధికారులు, ప్రజలు వాటిపై నుంచి నడుస్తున్నారు. ఇంతలో వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో మేయర్ సహా అందరూ పది ఫీట్ల ఎత్తు నుంచి కింద పడిపోయారు. కింద అంతా రాళ్లు ఉండడంతో మేయర్ సహా 20 మంది తీవ్రంగా గాయపడగా, 8 మందికి ఎముకలు విరిగిపోయాయి. దీంతో బ్రిడ్జి నిర్మించిన ఇంజినీర్‌పై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.