ఫేక్ వార్త..ఆ హోటల్ మూతపడేలా చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

ఫేక్ వార్త..ఆ హోటల్ మూతపడేలా చేసింది

May 18, 2017

సోషల్ మీడియా ట్రెండ్ లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టం. వాట్సప్ , ఫేస్ బుక్ లో ఏదైనా పోస్టింగ్ వచ్చిందంటే ఠక్కున షేర్ చేసేస్తున్నారు. ఇలా మనిషి మాంసం అమ్ముతున్నారన్న ఫేక్ న్యూస్ యూకేలోని ఓ భారతీయ రెస్టారెంట్‌ క్లోజ్ చేసింది.

యూకేలోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో మనిషి మాంసం వండుతున్నారని ఫేక్‌ వార్త వైరల్ అయింది. నాన్‌వెజ్‌ వంటకాల పేరిట మనిషి మాంసం వడ్డిస్తున్నారంటూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు క్షణాల్లో వ్యాపించింది. దీన్ని నమ్మిన కొందరు దాడి చేసేందుకు హోటల్‌పైకి కూడా వచ్చారు. దీనిపై స్పందించిన ‘కర్రీ ట్విస్ట్‌’ రెస్టారెంట్‌ యాజమాన్యం తమ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకే కొందరు గిట్టని వ్యక్తులు ఇలా చేశారన్నారు. ఓ ఫేక్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ప్రచురించిన వార్తను ఎలా నమ్మారో తెలీడం లేదని చెప్పారు. కేవలం ఒక కాలమ్‌.. దాని నిండా స్పెల్లింగ్‌ మిస్టెక్స్‌ ఉన్నాయని వార్త పై పోలీసులకు కంప్లెయింట్ చేశామన్నారు.