ఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 20వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 20వేలకే 5జీ స్మార్ట్ ఫోన్

April 30, 2022

ఫోన్ ప్రియులకు వన్ ప్లస్ సంస్థ శుభవార్త చెప్పింది. తమ కంపెనీకి చెందిన 5జీ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 20 వేల రూపాయలకే అందిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన వన్ ప్లస్ సంస్థ యూజర్ల కోసం అధునాతన టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు తయారుచేస్తూ, అభివృద్ది బాటలో అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో మొదటిసారిగా రూ.20,000లలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తాజగా విడుదల చేసింది. నేటినుంచే విక్రయాలు షురూ చేశామని తెలిపింది.

ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది.” ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 33 వాట్ సూపర్ వూక్ చార్జర్‌తో వస్తుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్‌ను వాడాము. రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ, రియల్ మీ 9 ప్రో 5జీలోనూ ఇదే చిప్‌సెట్ ఉంది. 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్, పలు గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు రంగుల్లో లభిస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరా 64ఎంపీతో ఉంటుంది. సెల్పీ కోసం 16ఎంపీ కెమెరా ఏర్పాటు చేశాం” అని అధికారులు తెలిపారు.

ఇదివరకే ఈ వన్ ప్లస్ కంపెనీకి చెందిన నార్డ్ సీఈ 2 మార్కెట్లో ఉన్న విషయం తెలిసిందే. దీని ధర రూ.23,000-25,000 మధ్య ఉంది. ఇప్పుడు దీనికి లైట్ వెర్షన్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ అనే పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈరోజు నుంచి అమెజాన్, వన్ ప్లస్ ఇండియా వెబ్‌సైట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్, ఇతర భాగస్వామ్య స్టోర్లలో వీటి విక్రయాలు మొదలవుతాయని కంపెనీ పేర్కొంది.