బయో పిక్ ల బాస్....ఇంకెవరు...ఆయనే....... - MicTv.in - Telugu News
mictv telugu

బయో పిక్ ల బాస్….ఇంకెవరు…ఆయనే…….

July 5, 2017

రాంగో పాల్ వర్మ…. ఒక్కోసారి …..కాదు కాదు… చాలా సార్లు రాంగ్ గోపాల్ వర్మగా  కూడా మీడియాలో ఉంటున్నాడు. అయితే తాజాగా ఆయన ఎన్టీఆర్ బయో పిక్ తీస్తున్నానని చెప్పారు. దానికి సంబంధించిన వర్క్ కూడా చేస్తున్నారట. దీనిపై ఓ పాట కూడా రాశారట. ఎన్టీఆర్ కున్న  శత్రువులెవరు… మిత్రులెవరు  విషయాలను కూడా ప్రపంచానికి చూపిస్తానని అంటున్నారు వర్మ గారు.

బయో పిక్ లు తీయడంలో వర్మకు వర్మనే సాటి.  తీసినవి కొన్ని… ఇంకా  తీయాల్సినవీ ఉన్నాయని అంటున్నారు వర్మ. ఈయన  బయో పిక్ ల గురించి ప్రచారం చేసేది ఒకటైతే.. సిన్మల ఉండేది మరోటనే  విమర్శ ఉండనే ఉంది. అప్పడం టైప్ అనే కొందరంటే… ఏదో  హైప్ క్రీయేట్ చేసి మాంచి బిజినెస్ చేసుకుంటున్నాడనే ఇంకొందరంటారు.

మీడియాను, సోషల్ మీడియాను వాడుకోవడంలో ఈయనను మించిన వారు లేరు.  ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. తెలుగు వారి కథానాయకుడు ఎన్టీఆర్ గురించిన మూవీ అనే వరకు సహజంగానే అంచనాలు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే హైప్ క్రియేట్ చేసుకున్నారు వర్మ.

ఆయన ఎంచుకునే బయో పిక్ లు కూడా   ఆషామాషీవి కాదు.. దేశ , రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపినవే. అస్సలు హైప్ ఇక్కడే స్టార్ట్ చేస్తాడు. ఇప్పటి  వరకు ఆయన తీసిన కొన్ని బయో పిక్ లు గమనిస్తే  విషయం ఈజీగా అర్థం అవుతుంది.

రక్త చరిత్ర, కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి, రెడ్డిగారు పోయారు, నాయిమ్, శశికళ, నాథూరాంగాడ్సే, ఎన్టీఆర్ ఇందులో ఇప్పటికే తీసినవి ఉన్నాయి. ఇంకా తీయాల్సినవి ఉన్నాయి. ఇందులో ఎన్నీ హిట్లో… ఎన్ని ఫట్లో  ప్రేక్షకులకు  తెలిసిందే.

వర్మ అందరి లాంటి డైరెక్టర్ కాదు… ఈయన క్రియేటీవిటీ ఉన్న పర్సనాలిటీనే.  ఎంత చెత్త సిన్మ అయినా  తీస్త… అది నాయిష్టం… చూడటం చూడకపోవడం మీ ఇష్టం అంటారు. మరి  అన్న  రామారావు బయో పిక్ ఎట్లా  తీస్తారో. ఇప్పటికైతే మాంచీ హైప్ తెచ్చుకున్నారు వర్మ. తెలుగు సిన్మ పరిశ్రమల మూవీ తీస్తూ హైప్ తెచ్చుకునేది రాజమౌళీ అయితే… మూవీ తీయక ముందు నుండే హైప్ తెచ్చుకోవడం డైరెక్టర్  వర్మకు  తప్ప ఎవరికి సాధ్యం.