బాలుడి రేప్ కేసు గుట్టురట్టు! - MicTv.in - Telugu News
mictv telugu

బాలుడి రేప్ కేసు గుట్టురట్టు!

May 18, 2017

 

పదేళ్ల బాలుడు రేప్ చేశాడని ఢిల్లీలో ఓ పనిమనిషి కేసు పెట్టింది. ఆమె వయసు 21 సంవత్సరాలు. ఆ యజమాని కొడుకు వయసు 11ఏళ్లు. వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసమే అనుమానాలకు తావిచ్చింది. పైగా ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. యజమాని కొడుకు తనను బెడ్ మీదకు తోసి రేప్ చేశాడని పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది. 11 ఏళ్ల బాలుడు 21 సంవత్సరాల వయసున్న యువతిని బలవంతం చేయడం సాధ్యం కాదని జువైనల్ జస్టిస్ బోర్డ్ సభ్యులు నిర్ధారించారు. పనిమనిషి చెప్పిన విషయం పూర్తి అవాస్తమని తేల్చారు. డబ్బు కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేసిందని తెలుసుకున్నారు. చివరికి ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసిందని కేసు పెట్టారు.