బాహుబలి 2 ని దంగల్ దాటేసింది..!
ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ దగ్గర రెండు ఇండియన్ చిత్రాలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. రికార్డ్ కలెక్షన్స్ వసూళ్ళు చేస్తూ అంతర్జాతీయ చిత్రాలకు సవాల్ విసురుతున్నాయి. అయితే మొన్నటి దాకా జక్కన్న తీసిన బాహుబలి 2 చిత్రం 1600 కోట్లతో టాప్ పొజీషన్ లో నిలవగా, ఇప్పుడు దానిని వెనక్కి నెట్టి దంగల్ మూవీ టాప్ కి చేరుకుంది. ఇండియన్ సినిమాల ప్రకారం దంగల్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా రికార్డుకెక్కింది. ఇండియాతో పాటు పలు దేశాలలో విడుదలైన ఈ చిత్రం సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా, చైనాలో 1100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. మొత్తంగా దంగల్ చిత్రానికి 1800 కోట్ల వసూళ్ళు వచ్చాయి. ఏ హాలీవుడ్ సినిమా కూడా సాధించలేని ఫీట్ ని దంగల్ దాటేసింది. చైనాలో వెయ్యి కోట్ల మార్కు అందుకున్న తొలి విదేశీ చిత్రంగా దంగల్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది.