బిగ్ బాస్ NTR - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ NTR

July 13, 2017

తాత వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న యువ హీరో మన జూనియర్ ఎన్టీఆర్. పేరులోనే తాతను ఇముడ్చుకున్న ఎన్టీఆర్ నటనలో తనదైన ఈజ్ తో నటించి ఎందరో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగాడు. అటు సినిమాలతో పాటు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నాడు ఈ నందమూరి యువ కిషోరం. స్టార్ మా టీవీలో త్వరలో ప్రారంభం అవనున్న ‘ బిగ్ బాస్ ’ రియాలిటీ షోతో తనలోని ఇంకొక వెర్షన్ను కొత్తగా ప్రెజెంట్ చెయ్యటానికి సర్వం సిద్ధం చేస్కుంటున్నాడు. నటన, డాన్సుల్లో తనదైన ముద్రతో గుండులా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైలాగ్ కొట్టినా, డాన్సలు చూసినా, ఎమోషన్స్ పండించాలన్నా, ఫైట్స్ సీక్వెన్స్ ఇలా., ఏదైనా తనదైన ప్రత్యేక ముద్ర వేసి ముందుకు దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ఎక్కువగా హిట్లతోనే ముందుకెళ్తున్నాడు.
ఇప్పుడొస్తున్న చాలా మంది యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా చేసిన ఈ ప్రోగ్రాం ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెల్సిందే. తెలుగులో సల్మాన్ ఖాన్ లెవల్లో ఆ ఠీవీని నిలబెట్టేది ఒకే ఒక్కడు జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన్ను సెలెక్ట్ చెయ్యటం హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ యాప్టెడ్ అంటున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ బిగ్ బాస్ సిరీస్ కోసం చాలా మంది నందమూరి ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా వున్నారు.