భక్తుడైతేనే భక్తి సినిమాలు తీయాలా…
భక్తుడైతే భక్తి సినిమా తీయాలా..రక్తి ఉంటే ఆ సినిమాలు చేయాలా..క్రైమ్ సస్పెన్స్ థిల్లర్ మూవీలు డైరెక్ట్ చేయాలంటే నేరగాడు అయి ఉండాలి.. మూవీవండర్ బాహుబలి డైరెక్టర్ జక్కన్న విషయంలో ఇలాగే కొందరు వాదిస్తున్నారు. ఆస్తికుడైతే భక్తిరస చిత్రాలు చేయాలంటున్నారు.
సినిమా అంటే రంగులలోకం.సినిమా అంటే మదిలో ఊహాలకు దృశ్యరూపం. సినిమా అంటే కల్పిత,వాస్తవగాథల సమ్మిళితం..తీసేవారు ఇలాగే చూడాలి. చూసేవారు ఇలానే ఆలోచించాలి. లేదంటే అనవసర రచ్చే. ఎవరికివారు వితండవాదనలు చేసుకోవాల్సిందే. వాదులాటతో నయా పైసా లాభం లేకపోయినా కొందరికి ఇది మహా సరదా. వార్తల్లో ఉండలనే యావ తప్ప మరేది కాదు.
విజువల్ వండర్ బాహుబలి ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లిన రాజమౌళిని ఇప్పుడు వివాదంలోకి లాగారు. సినిమా సక్సెస్ కావడంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న జక్కన్న తాను ఆస్తికుడిని కాదు, నాస్తికుడిని అని చెప్పాడట. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. కొన్ని తమిళ పత్రికలు కూడా రాజమౌళి జనాలని తప్పుదోవ పట్టిస్తున్నారని కథనాలు రాస్తున్నాయి.
రాజమౌళికి సినిమాల పరంగానే ఆస్తికత్వం కావాలి తప్ప నిజజీవితంలో అవసరం లేదా అంటూ కొందరు ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఈయనని టార్గెట్ చేశారు. మగధీర క్లైమాక్స్ ఫైట్ శివుడి చుట్టూ జరగగా, బాహుబలి తొలి భాగంలో ప్రభాస్ లింగాన్ని ఎత్తుకొనే సీన్లను రాజమౌళి.అద్బుతంగా చిత్రీకరించాడు రెండో పార్ట్ లోను శివుడి విబూధిని ప్రభాస్ శరీరానికి రాసుకొని భళ్ళాలదేవుడి తో ఫైట్ చేశాడు. మరి సినిమాలలో దైవ భక్తిని అంతగా చూపించే జక్కన్న తాను నాస్తికుడు అనడం కొందరికి నచ్చడం లేదు. జనాలని తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు అంటుంటే, మరి కొందరు ఆస్తికత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు అని మండి పడుతున్నారు.
నిజమే రాజమౌళి నాస్తికుడే అనుకుందాం… ఇంటర్నేషనల్ లెవల్లోకి వెళ్లే భక్తి సినిమాలు చేయకుడదా…భక్తుడు అయితేనే అలాంటి సినిమాలు చేయాలా..వ్యక్తిగత ఇష్టాయిష్టలకు రీల్ కు సంబంధం ఏంటీ…?అపారమైన భక్తిశ్రద్దలు ఉన్నోళ్లే ఇప్పటిదాకా భక్తి సినిమాలు తీశారా…
సరే ఆస్తికుల మాట ప్రకారం భక్తుడే భక్తి సినిమాలనుకుంటే ..నేరగాళ్లు క్రైమ్ సినిమాలు తీయాలి కదా… ఇదేలా సాధ్యం..క్రైమ్ సస్పెన్స్ థిల్లర్ ల విషయంలో వారు అదే మాటకు కట్టబడి ఉంటారా..
ఎవరైనా సినిమాను సినిమాలాగా చూడాలి. మంచిగా అనిపిస్తే సాహోరే అనాలి..లేదంటే నాలుగు తిట్టుకుంటూ వదిలేయాలి. కానీ ఇదేం అనవసర రచ్చో…