ప్రపండ భానుడు ఉగ్రరూపం దాల్చాడు.దంచికొడుతున్న ఎండలకు వాహనాలు పొగలు కక్కుతున్నాయి. పై నుంచి సూరీడు భగభగలు..కింద భూమి నుంచి సెగలు.. మధ్యలో కుతకుతలాడే ఇంజన్ వేడి..వెరసి వాహనాలు దగ్ధమవుతున్నాయి.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన బూదూరి లక్ష్మయ్య – లలిత దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగే వివాహానికి వెళుతున్నారు. వినోభానగర్ గ్రామం సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న ద్విచక్రహనానికి ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి…క్షణాల్లో యాక్టీవా వాహనం దగ్దమైంది… ఆందోళన చెందిన వారు వాహనాన్ని వదిలి పొలాల్లోకి పరుగులు పెట్టారు.వాహనం లోని రూ.3000 రూపాయల నగదు, దుస్తులు దగ్దమైనట్లు భాదితులు తెలిపారు.ఎండ తీవ్రతకు ఇంజన్ హీట్ఎక్కి ఈ ప్రమాదం జరిగి ఉంటుందంటున్నారు.