భారత్‌లోకి 'ఎక్స్‌ఈ' ఒమిక్రాన్ ఎంటర్.. తొలికేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లోకి ‘ఎక్స్‌ఈ’ ఒమిక్రాన్ ఎంటర్.. తొలికేసు నమోదు

April 6, 2022

carona

రెండు సంవత్సరాలపాటు యావత్ ప్రపంచ దేశాలను గజగజ వణికించిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ భారతదేశంలోకి ఎంటరైపోయింది. ఇప్పటికే కరోనా పుట్టిన దేశం.. చైనాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. దీంతో అక్కడి ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది.

 

ఈ క్రమంలో ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ”ఎక్స్‌ఈ” తొలి కేసు నమోదైంది. తాజాగా 230 శాంపిల్స్ పరీక్షించగా, 228 మందికి ఒమిక్రాన్, ఒకరికి ఎక్స్‌ఈ, ఒకరికి కప్పా వేరియంట్ సోకినట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బ్రిటన్‌లో జనవరి 19న తొలి ఎక్స్‌ఈ కేసు నమోదైందని అక్కడి వైద్యశాఖ తెలిపింది.

మరోవైపు జాతీయ టీకాకరణలో భాగంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 185 కోట్ల 4 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు వేశారు. అటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 185 కోట్ల 79 లక్షల వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందించామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 15 కోట్ల 70 లక్షలకు పైగా వినియోగించని వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇటువంటి సమయంలో కరోనా కొత్త వేరియంట్ తొలి కేసు నమోదు కావటం సంచలనంగా మారింది.