భువి..లక్కీ గర్ల్ టాలీవుడ్ హీరోయిన్..! - MicTv.in - Telugu News
mictv telugu

భువి..లక్కీ గర్ల్ టాలీవుడ్ హీరోయిన్..!

May 19, 2017

భారత క్రికెటర్ భువి లక్కీగర్ల్‌ ఎవరో తెలిసిపోయింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్‌, టాలీవుడ్‌ నటి అనుస్మృతి సర్కార్‌. వీరిద్దరూ కలిసి కారులో వెళ్తూ అభిమానుల కంటపడ్డారు. ఇంకేముంది వారు ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో భువి లక్కీగర్ల్‌ ఈమె అంటూ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. తెలుగులో ఈమె 2011లో వచ్చిన వంకాయ్‌ఫ్రై, ఆ తర్వాత 2014లో ఇష్టసఖి, 2015లో హీరోయిన్‌ చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఈ భామ ఇప్పటి వరకు నాలుగు బెంగాలీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ముంబయిలో ఉన్న అనుస్మృతి బాలీవుడ్‌లో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.