Sharad Pawar's "North India Mentality" Remark On Women Quota In Parliament
mictv telugu

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై శరద్ పవార్‌ సంచలన వ్యాఖ్యలు

September 18, 2022

చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే ఉద్దేశంతో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా పార్ల‌మెంట్ లో ఈ బిల్లుకు ఆమోద‌ముద్ర ల‌భించ‌లేదు. ఈ విష‌యంపై స్పందించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్త్ ఇండియా మెంటాల్టీ అని కామెంట్ చేశారు.

మహిళా నాయకత్వాన్ని అంగీకరించేందుకు దేశం ఇప్పటికీ సిద్ధంగా లేదని పవార్ అన్నారు. మహిళల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పటి నుంచి తాను పార్లమెంటులో మాట్లాడుతూనే ఉన్నానని… కానీ, ఇప్పటి వరకు ఆ బిల్లుకు ఆమోదం లభించలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై పార్లమెంటులో మాట్లాడిన తర్వాత… తమ పార్టీ ఎంపీలు కూడా లేచి వెళ్లిపోతుండటాన్ని తాను చూశానని… అంటే, తమ పార్టీ నేతలకు కూడా మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదనే విషయం అర్థమవుతోందని అన్నారు.