Home > Social > మైక్ టీవీ… మీ కోసం గోల్కొండ బోనాల జాతర ను సమర్పిస్తుంది..

మైక్ టీవీ… మీ కోసం గోల్కొండ బోనాల జాతర ను సమర్పిస్తుంది..

మైక్ టీవీ మీ కోసం గోల్కొండ బోనాల జాతర ను సమర్పిస్తుంది..

బోనాల సంబురం..సంస్కృతీ వైభవం
ఆషాఢ మాసంలో ధూంధాంగా పండుగ
భోజనం అని అర్థం కలిగిన బోనం
అమ్మవారికి సమర్పించే నైవేద్యం
అన్నంతో పాటు పాలు, బెల్లంతో తయారీ
రాగి, మట్టి కుండలకు వేప రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరణ
బోనం పై ఒక దీపం
డప్పు చప్పుళ్లు,పోతురాజుల విన్యాసాల నడుమ గుడికి పయనం
అమ్మవారికి మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ,
డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ పేర్లు

ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం
సొంత కూతురు ఇంటికి వచ్చిన భావన
ప్రేమానురాగాలతో ఆహార నైవేద్యం బోనాల సమర్పణ
పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి…
కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీ
బోనం ఎత్తుకున్న వారిని అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం
అందుకే వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు

గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో
ఆషాఢమాసం మొదటి గురువారంతో వేడుకలు షురూ
సికిందరాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి
లష్కర్ బోనాలతో ముగింపు
ఆషాఢమాసమంతా ప్రతి గురు, ఆదివారాల్లో బోనాలు
కాకతీయుల కాలం నుంచే బోనాల వేడుకలు

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజు
పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ
ఫలహారం బండి దగ్గర నర్తన

రెండో రోజు రంగం
రంగం తర్వాత ఘటం ఉత్సవం
అమ్మవారి ఆకారంలో అలంకరించిన రాగి కలశమే ఘటం
తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఘటం ఊరేగింపు
ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలు
సాయంత్రానికి నయాపుల్ దగ్గర ఘటముల నిమజ్జనతో బోనాల ముగింపు

Updated : 14 July 2017 10:32 AM GMT
Next Story
Share it
Top