It was Modi who came to me: Chandrababu
mictv telugu

మోదీనే నా దగ్గరకు వచ్చారు: చంద్రబాబు

August 10, 2022

It was Modi who came to me: Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఢీల్లీ పర్యటనపై తెగ చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకెళ్లారు? మోదీని ఎందుకు కలిశారు? టీడీపీ, బీజేపీలు ఏకమవుతున్నాయా? చంద్రబాబు, మోదీ ఏం మాట్లాడుకున్నారు? అనే తదితర అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తెగ ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలో తనపై జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు నాయుడు తాజాగా స్పందించారు. మోదీ ఆహ్వానం మేరకు ఢీల్లీకి విచ్చేసిన ప్రముఖులందరినీ పలకరిస్తున్న క్రమంలోనే తనను కూడా సహజంగానే మోదీ పలకరించారని చంద్రబాబు క్లారిటి ఇచ్చారు. ”రాష్ట్రపతి భవన్‌లో నేను ఇతరులతో మాట్లాడుతున్న సమయంలో..ప్రధాని ఆ కార్యక్రమానికి హాజరైయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఒక్కొక్కరినీ పలకరిస్తూ, నా వద్దకు వచ్చారు. ఆయన నా వద్దకు రాగానే..’మనం కలిసి చాలా రోజులైంది. ఢిల్లీకి రావటం లేదా’ అంటూ నన్ను ప్రశ్నించారు. దానికి నేను ఢిల్లీలో పనేమీ లేదని, అందుకే రావటం లేదని చెప్పాను” అని చంద్రబాబు అన్నారు.

అంతేకాదు, మరోసారి మనమిద్దరం కలవాలని, మీతో మాట్లాడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని మోదీ తనతో అన్నట్లు చంద్రబాబు తెలిపారు. దానికి వెంటనే తాను కూడా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నానని ప్రధానితో చెప్పినట్లు బాబు వెల్లడించారు. దీనికి స్పందించిన ప్రధాని..’ఢిల్లీకి వీలు చూసుకొని రండి. వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి. నాకు వీలుగా ఉండే సమయం చెబుతా” అని ఆయన అన్నారని చంద్రబాబు వివరణ ఇచ్చారు. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై పలు విధాలుగా చర్చించుకుంటున్నా వారికి సమాధానం రావడంతో ఆ చర్చలు పులిస్టాప్ పడినట్లైంది.