Home > Featured > యంగ్ డైనమిక్ లుక్‌లో కేటీఆర్.. 20 ఏళ్ల నాటి ఫోటో షేర్..

యంగ్ డైనమిక్ లుక్‌లో కేటీఆర్.. 20 ఏళ్ల నాటి ఫోటో షేర్..

KTR

సరదాగా తీసుకున్న ఫోటోలను కొంతకాలం అయ్యాక చూసుకుంటే చాలా థ్రిల్లింగ్‌గా వుంటుంది. అప్పుడు మనం ఇలా వున్నామా.. ఇప్పుడు ఇలా అయ్యామా అని మనల్ని మనం తరచి చూసుకుంటాం. ఫోటోలు తీపి జ్ఞాపకాలుగా మనకు ఎప్పుడు చూసినా మంచి అనుభూతిని ఇస్తాయి. అదే సెలెబ్రిటీ హోదాలో వున్నవాళ్ల ఫోటోలను చూసినప్పుడు ఆ అనుభూతి సెలబ్రిటీలకే కాదు, వారిని అభిమానించేవారికి కూడా అంతకు మించిన అనుభూతి కలుగుతుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను అభిమానించేవారికి మంచి అనుభూతిని పంచారు.

1999లో తన స్నేహితుడు మహేష్ వోడెలతో దిగిన ఓ ఫోటోను కేటీఆర్ తన ఎఫ్‌బీ ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫోటో దిగి 20 ఏళ్లు అవుతోంది. డెనిమ్ షర్టు, మీసం, మోడ్రన్ హెయర్ స్టైల్‌తో కేటీఆర్ ఆకట్టుకున్నారు. ఆ ఫోటోను చూసి చాలామంది స్పందిస్తున్నారు. ‘ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులను గుర్తుంచుకోవడం మీ గొప్పతనం సార్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘మీ లుక్ చాలా బాగుంది.. డైనమిక్ లీడర్’ అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కేటీఆర్ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమస్యలపై సత్వరమే స్పందిస్తూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటారు. అదే సమయంలో అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోలు షేర్ చేసి సర్‌ప్రైజ్ చేస్తుంటారు.

Updated : 23 Aug 2019 11:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top