యాద్రాద్రిలో గుడిసెలు దగ్ధం - MicTv.in - Telugu News
mictv telugu

యాద్రాద్రిలో గుడిసెలు దగ్ధం

May 20, 2017


యాదగిరిగుట్టలో ప్రమాదవశాత్తు మంటలంటుకుని వంద గుడిసెలు దగ్ధమయ్యాయి. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా పనులు చేపడుతున్నారు. సాయిపవన్‌ కనస్ట్రక్షన్‌ సంస్థలు పనులు చేస్తున్నాయి. ఈ కంపనీలో పనిచేస్తున్న పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఒడిశాకు చెందిన కూలీలు .. పనులు జరిగే సమీపంలో గుడిసెలు వేసుకున్నారు. శనివారం ఉదయం కూలీలు పనిలోకి వెళ్లారు. ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు సమీపంలో ఉన్న వందకుపైగా గుడిసెలకు పది నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కూలీలు మంటలను కంపనీ వాహనాల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. . ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోయినా రెండు ఆవులు మృతిచెందాయి.