Home > Flash News > రజనీ రావడం పక్కా గానీ..ఎప్పుడొస్తారు..?

రజనీ రావడం పక్కా గానీ..ఎప్పుడొస్తారు..?

ఎప్పుడూ సినిమా డైలాగులు చెప్పే సూపర్ స్టార్ రజనీకాంత్.. రాజకీయాలపై లెక్చర్లు ఇస్తున్నారు. ఎనిదేళ్ల తర్వాత అభిమానులతో సమావేశమైన తొలిరోజు నుంచి చివరిరోజు దాకా రాజనీతిశాస్త్రమే బోధించారు. దీన్ని బట్టే రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమని అర్థమవుతోంది. ఆ సరైన టైమ్ ఎప్పుడో కాని ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

తలైవా తయారవుతున్నారు.మేకప్ తీసేసి రాజకీయచదరంగం ఆడేందుకు సై అంటున్నారు. అవినీతి కంపుకొడుతోన్న రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యంగా ప్రసంగాలు దంచికొడుతున్నారు. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లోకి వచ్చేస్తున్నారు. పొలిటికల్ లైన్ లోకి ఎంటర్ కాబోతోన్న రోబో గ్రౌండ్ వర్క్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత అభిమానులతో సమావేశమయ్యారు. మరీ ప్రాంతాల వారీగా. వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటూనే ఉదయం నుంచి సాయంత్రం దాకా రాజకీయాలపైనే కాన్సంట్రేషన్ చేశారు.

సోమవారం నుంచి చివరి రోజైన శుక్రవారం వరకు తమ అభిమాన నటుడిని కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సమావేశాల్లో సూపర్ స్టార్ రజనీ మాట్లాడుతూ ‘నేను కర్ణాటకలో 23ఏళ్లు ఉన్నాను, తమిళనాడులో 43ఏళ్లుగా ఉంటున్నాను. నేను కర్ణాటక వాడినైనా మీరు నన్ను స్వాగతించి నిజమైన తమిళుడిగా ఆదరించారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సి ఉంది. రాజకీయాల్లో ఎంతో మంది సీనియర్‌ నాయకులు ఉన్నారు, జాతీయ పార్టీలు ఉన్నాయి.. కానీ రాజకీయ పరిస్థితి మాత్రం సక్రమంగా లేదు. ప్రజాస్వామ్యం క్షీణించింది. ఈ వ్యవస్థ మారాలి. ప్రజల ఆలోచనల్లోనూ మార్పు రావాలి, అప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుంది’ అని రజనీ అన్నారు.

ఇప్పటికప్పుడు రజనీకాంత్ అభిమానులతో సమావేశం కావాల్సిన అవసరం ఏం ఉంది. సమావేశమైనా మూవీ ముచ్చట్లు కాకుండా రాజకీయాలపై ఎందుకు ఫోకస్ చేశారు.ఇదంతా చూస్తుంటే అతి త్వరలోనే రజనీ రాజకీయాల్లోకి రాబోతున్నారని స్పష్టంగా తెలుస్తున్నది. మారిన తమిళనాడు పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా కలిసి వస్తున్నాయి. ఈ ఒకటి, రెండేళ్లే సరైన టైమ్ అని తలైవా భావిస్తున్నట్టు ఉన్నారు. అందుకే ముందుగా కార్యకర్తల్ని సంసిద్ధం చేస్తున్నారు.
మొత్తానికి రాజకీయాల్లోకి తలైవా ఎంటరైతే … తమిళనాడు రాజకీయ ముఖచిత్రమే మారిపోతోంది. దేశ రాజకీయాలపై ఇదే ప్రభావం చూపే అవకాశం ఉంది.

Updated : 19 May 2017 4:36 AM GMT
Next Story
Share it
Top