“రాయ్” దెబ్బకు ముంబై గూబ గుయ్ - MicTv.in - Telugu News
mictv telugu

“రాయ్” దెబ్బకు ముంబై గూబ గుయ్

April 14, 2018

జొనాదన్ రాయ్ ధనాధన్ ఆటతో ఢిల్లీ డేర్ డెవిల్స్ దుమ్ము రేపింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జాసన్ రాయ్ సూపర్ ఇన్నింగ్స్ తో మూడో మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది. 53 బాల్స్ లో ఆరు ఫోర్లు, ఆరు సిక్స్ లతో 91 రన్స్ చేసి “రాయ్” రఫ్పాడించిండు.16 బాల్స్ లో 15 రన్స్ చేసిన గంభీర్ తొందరగా ఔట్ అయినా కూడా ఎక్కడా తగ్గకుండా రిషబ్ పంత్ తో కలిసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిండు. ఆ తర్వాత పంత్ పెవీలియన్ చేరినా, మాక్స్ వెల్ మెరుపులు లేకున్నా, శ్రేయస్ అయ్యర్ తో కలిసి ముంబై ఇచ్చిన 194 రన్స్ టార్గెట్ ను సింగిల్ హ్యాండ్ తో ఛేజ్ చేసిండు. అయితే ముంబై బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ సూపర్ బౌలింగ్ తో ఈజీగా గెలుస్తుందన్న మ్యాచ్ లాస్ట్ బాల్ దాకా వచ్చి టెన్షన్ పెట్టింది. లాస్ట్ ఓవర్ లో 11 రన్స్ కావాల్సి ఉండగా ఫస్ట్ బాల్ ను ఫోర్ , సెకండ్ బాల్ సిక్స్ కొట్టి ఢిల్లీని గెలుపు వాకిట్లో తీసుకొచ్చి నిలబెట్టిండు. అయితే వరుసుగా మూడు డాట్ బాల్స్ వేసి ముస్తఫిజుర్ ఢేర్ డెవిల్స్ వెన్నులో వణుకు పుట్టించిండు. చివరి బంతికి రన్ చేస్తే ఢిల్లీ గెలుస్తుంది. చేయకుంటే మ్యాచ్ డ్రా అయి సూపర్ ఓవర్ కు పోతుంది. అయితే విన్నింగ్ షాట్ ను బ్యాట్ మీద ముందే రాసి పెట్టుకొచ్చిన రాయ్, లాస్ట్ బాల్ సింగిల్ తీసి ఢిల్లీని గెలిపించిండు.

అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కేప్టెన్ గౌతం గంభీర్, బౌలింగ్ తీసుకున్నడు. సొంత గ్రౌండ్ లో ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ తో ముంబై ఇన్నింగ్స్ మొదలైంది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్,ఇవిన్ లూయిస్ ల జోరుతో   ముంబైకి మెరుపు ప్రారంభం దొరికింది. ఓ దశలో 200 రన్స్ పైనే టార్గెట్ ఇస్తుందనుకున్న ముంబై ని ఢిల్లీ 194 కే ఫిక్స్ చేసింది.

సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న జాసన్ జొనాదన్ రాయ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.