రూ.1000 నాణెం విడుదల నిజమే..! - MicTv.in - Telugu News
mictv telugu

రూ.1000 నాణెం విడుదల నిజమే..!

May 26, 2017

జనంతో ఆడుకోవడం ఆర్ బీఐకి సరదా అయింది.డీమానిటైజేషన్ తో చుక్కులు చూపించిన కేంద్రబ్యాంకు…2వేల నోటు తెచ్చి కంగారు పెట్టింది. ఇప్పటికి రెండు రూపాయల వేలనోటు చిల్లర దొరక్క జనం కొంటుకుంటున్నారు. నో క్యాష్ బోర్డులతో దాదాపు సగం ఏటీఎంలు మూతపడ్డాయి. మరో పావు సగంలో ఎప్పుడూ డబ్బులు ఉండటం లేదు.మిగతా పావు సగం ఏటీఎంలలో మాత్రమే డబ్బులు నింపుతున్నారు. ఫస్ట్ తారీఖు వచ్చిందంటే జనానికి ఏటీఎంల కష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు మళ్లీ వెయ్యి నాణేం తీసుకొచ్చింది. ఎప్పుడు విడుదల చేసిందో కానీ సోషల్ మీడియా వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. అంతా పుకార్లు అని నెటిజన్లు అనుకున్నారు కానీ…వెయ్యి బిళ్ల నిజమేనని ఆర్బీఐ స్పష్టం చేసింది.
నోట్ల రద్దు తర్వాత మార్కెట్‌లో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. రూ.10 నాణేలు సైతం రద్దయ్యాయన్న వార్తతో సామాన్యులు ఆందోళన చెందారు. అదంతా అసత్యమని ఆర్బీఐ స్పష్టం చేసింది. అదే సమయంలో రూ.1000 నాణెం విడుదలైందంటూ సోషల్ మీడియాలో మరో న్యూస్ చక్కర్లు కొట్టింది. ఈ రూ.1000 నాణెంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చాలా మంది ఆ కాయిన్ ఇమేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎవరో మార్ఫింగ్ చేశారని మరి కొందరు నెటిజన్లు పోస్ట్ చేశారు. దానిపై ఆర్బీఐ ఎట్టకేలకు రియాక్టయింది. నాణేన్ని విడుదల చేసిన మాట వాస్తవమేని తెలిపింది. వెయ్యి బిళ్ల ఎప్పుడు చేతిలోకి వస్తుందో చూడాలి.