రేప్ చేయబోతే.. బాబాది కోసేసింది..! - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ చేయబోతే.. బాబాది కోసేసింది..!

May 20, 2017

 


అతడో దొంగబాబా.ఆశ్రయంలో ఉన్న ఓ యువతిపై కన్నేశాడు.ఆమెను నిత్యం వేధిస్తున్నాడు. శుక్రవారం ఒంటరిగా ఉండటాన్ని చూసి అత్యాచార యత్నం చేశాడు. అంతే ఆమె తిరగబడింది. మామూలుగా కాదు సింహాంలా.. ఏకంగా దొంగబాబా మర్మాంగాన్ని కోసేసింది.

కేరళ కోళ్లామ్‌లోని పద్మనలో 23 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి గణేషానంద తీర్థపద స్వామి(54) అలియాస్ హరి ఆశ్రమంలో ఉంటోంది. యువతి తల్లిదండ్రులు ఆ దొంగబాబును విశ్వసించి ఆశ్రమంలో ఉంటూ సేవలు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆ యువతిపై దొంగబాబా కన్నేశాడు. కొంతకాలం నుంచి గణేషానంద స్వామిగా సేవలు పొందుతున్న అతడు యువతిని వేధిస్తున్నాడు. రెండు రోజులుగా అతడి శృతిమించాయి. శుక్రవారం రాత్రి యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి, ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. వారించినా బాబా వినకుండా దారుణానికి ఒడిగట్టడంతో పురుషాంగాన్ని కోసేసినట్లు బాధితురాలి చెప్పింది. తిరువనంతపురం పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన విషయంపై కంప్లయింట్ చేసింది. పోస్కో చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ గణేషానంద స్వామి తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.