లాక్‌డౌన్‌లో బయటికొచ్చాడని కాల్చి చంపేశారు..  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌లో బయటికొచ్చాడని కాల్చి చంపేశారు.. 

April 4, 2020

Nigeria lockdown army shoot 

కరోనా వ్యాప్తి చెందకుండా పలు దేశాల్లో విధించిన లాక్‌డౌన్ ఎంతో మంది చావులకు కారణమవుతోంది. పోలీసుల నిర్లక్ష్యం, దూకుడు, ప్రభుత్వాల చేతగానితనం వల్ల కొన్ని దేశాల్లో కోరోనా కంటే ఇలాంటి పరోక్ష మరణాలే ఎక్కువగా నమోదవుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లోంచి బయటికొచ్చాడని ఓ వ్యక్తిని ఆర్మీ కాల్చిచంపంది. ఆఫ్రికాఖండ దేశం నైజీరియాలో గురువారం ఈ దారుణం జరిగింది. డెల్టా రాష్ట్రంలోని వారీ పట్టణానికి చెందిన ఓ యువకుడు బయటికి వచ్చాడు.  గస్తీ తిరుగుతున్న ఓ జవాన్ అతణ్ని అక్కడికక్కడే కాల్చి చంపేశాడు. ఆఫ్రికా దేశాల్లో లాక్ డౌన్ ఉల్లంఘన కింద ఇలాంటి కాల్పులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. కెన్యాలో 13 ఏళ్ల బాలుడిని కూడా పోలీసులు పొట్టనెబ్టుకున్నారు.