వడగాలే..కదా అని లైట్ తీస్కోంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

వడగాలే..కదా అని లైట్ తీస్కోంటే..

May 26, 2017

రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. రోజురోజుకూ ఎండ‌లు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌తలు 50 డిగ్రీలు దాటాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచే వ‌డ‌గాలుల ప్ర‌భావం ఉంటున్న‌ది. ఎండ‌లతో పిల్ల‌లు, వృద్ధులు ఎక్కువ‌గా వ‌డ‌దెబ్బ‌కు గుర‌వుతున్నారు. వడ‌గాలి ప్రాణాంత‌కం కావ‌చ్చ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ అథారిటీ సైతం ధృవీక‌రించింది. వడ‌దెబ్బ త‌గ‌ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని సూచిస్తోంది.
వడ‌దెబ్బ-జాగ్రత్తలు
*త‌ర‌చూ నీళ్లు తాగుతుండాలి. నోరు ఆరిపోకూడదు.
*ఎక్కువ‌గా ల‌స్సీ, మ‌జ్జిగ‌, నిమ్మ‌ర‌సం, అంబ‌లి తీసుకోవాలి.
*తేలికైన‌, లేత రంగు కాట‌న్ దుస్తుల‌ను ధ‌రించాలి.
*బ‌య‌లికి వెళ్లేట‌పుడు టోపీ గానీ, గొడుగును తీసుకెళ్లాలి.
*ఆగి ఉన్న వాహ‌నాల దగ్గర పిల్ల‌ల‌ను ఉండ‌నీయొద్దు
*ద్విచ‌క్ర వాహ‌నాల‌పై ప్ర‌యాణించే వారు త‌ల‌కు హెల్మెట్ తెల్ల‌ని గుడ్డ‌ను క‌ట్టుకోవాలి. ఎక్కువ దూరం వెళ్లే వారు మ‌ధ్య మ‌ధ్య‌లో నీడ పాటు ఆగి నీళ్లు తాగాలి.