‘వన్నాక్రై’ ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ తో షాక్ అవుతున్న కంప్యూటర్ వరల్డ్ మరో షాక్ తగిలింది. ‘వన్నాక్రై’కి మించిన మరో వైరస్ కంప్యూటర్లపై దాడికి దిగిందని సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. ‘అడిల్‌కుజ్’గా పిలుస్తున్న ఈ వైరస్ ‘వన్నాక్రై’ కంటే అత్యంత డేంజరస్.
‘వన్నాక్రై’ మాదిరిగానే అడిల్‌కుజ్ కంప్యూటర్లపై దాడి చేస్తుంది.‘వన్నాక్రై’ వైరస్ దాడికి గురైన కంప్యూటర్లోని ఫైళ్లన్నీ ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి. హ్యాకర్లకు బిట్‌కాయిన్ రూపంలో డబ్బు చెల్లిస్తేనే ఆ కంప్యూటర్ మామాలు స్థితిలోకి వస్తుంది. కానీ.. అడిల్‌కుజ్ మాత్రం అలా చేయదట. గుట్టుచప్పుడు కాకుండా కంప్యూటర్లలోకి చొరబడి.. వినియోగదారుడికి తెలియకుండానే అతను జరిపే బ్యాకింగ్ ఖాతాల వివరాలను తస్కరించి హ్యాకర్ల ఖాతాల్లోకి బిట్‌కాయిన్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసేస్తుందని పరిశోధకులు తెలిపారు.