వీడికి ఎంత బలుపు..జనాల్ని కారుతో తొక్కించేశాడు... - MicTv.in - Telugu News
mictv telugu

వీడికి ఎంత బలుపు..జనాల్ని కారుతో తొక్కించేశాడు…

May 20, 2017

అమెరికా నేవీ మాజీ ఉద్యోగి డ్రగ్స్ మత్తులో చెలరేగాడు. మనుషులను తొక్కిస్తూ కారును నడిపి కలకలం రేపాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ యువతి చనిపోగా, 20 మందికి గాయాలయ్యాయి.

న్యూయార్క్ సిటీలోని రద్దీ ప్రాంతం టైమ్స్ స్కేర్‌ సమీపంలోని 42 స్ట్రీట్‌లో మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకున్న యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి రిచర్డ్ రోజస్ కారు నడుపుతున్నాడు. సిగ్నల్ దగ్గర యూ టర్న్ తీసుకున్నాడో లేదో కొన్ని సెకన్లలో బీభత్సం సృష్టించాడు. కారు ఛేజ్ బ్యాంకు దగ్గరకు రాగానే రోడ్డుపై వెళ్తున్న దాదాపు 10 మందిపైకి దూసుకెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు.. మూడుసార్లు జనాలపైకి కారును నడిపిన నేవీ వెటరన్‌.. 30 మందిని ఢీకొట్టాడు. కారును ర్యాష్ గా డ్రైవ్ చేయడంతో జనం పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఓ 18 ఏళ్ల యువతి మృతిచెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారిపోయేందుకు పరుగెత్తుతున్న నిందితుడి రిచర్డ్‌ను న్యూయార్క్ పోలీసులు నిందితుడు అరెస్ట్ చేశారు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

https://www.youtube.com/watch?v=PNIY0l52OB4