వీడియో: యాజమానిపై కూలీ ఆగ్రహం.. రూ.కోటి కారును తగలబెట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో: యాజమానిపై కూలీ ఆగ్రహం.. రూ.కోటి కారును తగలబెట్టాడు

September 15, 2022

ఓ కూలీ కొన్ని నెలలుగా రాత్రనక, పగలనక కష్టపడి పనిచేస్తే, తనకు ఇవ్వాల్సిన రూ.2 లక్షల రూపాలయను ఇవ్వకుండా, వాయిదాల మీద వాయిదాల వేస్తూ, డబ్బులు ఇవ్వటం లేదని యాజమాని..కోటి రూపాయలు విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టేశాడు. దాంతో చుట్టుపక్కల ఉన్నవారు బెంబేలెత్తిపోయారు. వెంటనే కారు యాజమానికి సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టంట చక్కర్లు కొడుతోంది.

 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నివాసముంటున్న ఓ వ్యక్తి తనకు కూలీ డబ్బులు ఇవ్వలేదని యజమాని కారు తగలబెట్టి, పగ తీర్చుకున్నాడు. సుమారు రూ.2 లక్షల కూలీ పైసలివ్వలేదని యజమానికి చెందిన రూ.కోటి విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టేశాడు. ఈ దృశ్యాలు అక్కడి ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించిన యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

”జలాల్‌పూర్ గ్రామానికి చెందిన రణ్‌వీర్..నోయిడాలోని సదరపుర్ కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్ ఇంట్లో టైల్స్ పని చేశాడు. ఇందుకు సంబంధించి రణ్‌వీర్‌కు ఆయుష్ రూ.2 లక్షల కూలీ ఇవ్వాల్సి ఉంది. అనేక సార్లు వచ్చి అడిగినా, ఆయుష్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన రణ్‌వీర్.. మంగళవారం సదర్ పుర్ కాలనీకి బైక్ పై వచ్చాడు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి, నిప్పంటించి, పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యా యి. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా రణ్‌వీర్‌ను అరెస్టు చేశాం” అని పోలీసులు తెలియజేశారు.