ఇద్దరు సంగీత దిగ్గజాలు ఇండియన్ ఇండస్ట్రీలను షేక్ చేస్తున్నారు. ఎవరికి వారే షేక్ చేస్తుంటే.. మరి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది? ఎస్.. ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిందిప్పుడు. థమన్, అనిరుధ్‌లు కార్లో రైడ్ చేస్తూ సెల్ఫీ తీసుకున్న ఫోటోను షేర్ చేశారు, థమన్ ఈ చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
అనిరుధ్ ప్రస్తుతం జైలర్, ఇండియన్2లతో పాటు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇక థమన్ విషయానికొస్తే మహేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ ఎమ్బీ28, వీరసింహరెడ్డి, ఆర్సీ15, బోయపాటి రామ్‌ల సినిమాలతో బిజీగా ఉన్నాడు.
A drive Finally 🏎️ pic.twitter.com/3wo0TgoPWS
— thaman S (@MusicThaman) December 21, 2022
వారసుడు సినిమా మ్యూజిక్ ప్రొడక్షన్ పనుల కోసం చెన్నైలో ఉన్న థమన్‌ను… అనిరుథ్ కలవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా… ? సరదాగా కలిశారా అంటూ నెట్టింట జనం గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే డిసెంబర్ 24న జరగనున్న వరిసు(వారసుడు) ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరూ కలిసి వేదిక పంచుకోనున్నారు. వారసుడు సినిమాలోని కొత్త పాటను అనిరుధ్, థమన్ కలిసి పాడనున్నారు, ఇద్దరు రాకింగ్ మ్యూజిషియన్లను ఒకే స్టేజ్‌పై చూడటం సెన్సేషన్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.
సినిమాలతో పాటు థమన్ ప్రైవేట్ ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు. ఇటీవలే అమెరికాలో పలు వేదికలపై డ్రమ్మర్ శివమణితో కలిసి ఫెర్ఫామెన్స్తో అదరగొట్టాడు. అయితే ఈ డిసెంబర్ 31న హైదారాబాద్‌లో జరుగనున్న ఓ ఈవెంట్ థమన్, శివమణిలు పాల్గొనబోతున్నారు. సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ న్యూఇయర్ పార్టీ పేరుతో చేయబోతున్న ఈవెంట్‌కు కూడా థమన్ సిద్ధమవుతున్నాడు.