thief stolen cell phone from passenger in the running train in bihar
mictv telugu

వ్ వాట్ ఏ లూటీ.. వీడియో చూస్తే దిమ్మ తిరిగిపోద్ది

June 9, 2022

train

రైళ్లలో జరిగే దొంగతనాల గురించి మనం చాలా సార్లు విని ఉంటాం. చూన్ లాగి నిలువు దోపిడీ చేశారనీ, మత్తు మందు కలిపి నగలు దోచుకున్నారని తరచూ వార్తల్లో వచ్చేదే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ దొంగ స్పైడర్ మ్యాన్ స్టైల్లో దొంగతనం చేశాడు.

రైలు రన్నింగులో ఉండగా ఫుట్‌పాత్ మీద కూర్చున్న ప్రయాణికుడి నుంచి అత్యంత చాకచక్యంగా ఫోన్ లాగేసుకున్నాడు. అచ్చం సినిమా గ్రాఫిక్స్‌లాగా ఉన్న ఈ సంఘటన వెనుకబడిన బీహార్‌లో జరిగింది. వీడియో ప్రకారం.. బెగుసరాయ్‌లో ఉన్న నదీ వంతెన పైనుంచి రైలు వెళ్తోంది. ఆ వంతెన అచ్చం మన రాజమండ్రి గోదావరి పైనున్న బ్రిడ్జీలాగే ఉంటుంది. కొందరు కుర్రాళ్లు రైలు మెట్ల మీద కూర్చుని సరదాగా తమ ఫోన్లలో నది అందాలను వీడియో రూపంలో బంధిస్తున్నారు. ఇంతలో బ్రిడ్జి పైన ఉండే ఇనుప స్థంబాల పక్కన దాగి ఉన్న ఓ దొంగ కదులుతున్న రైలులో కూర్చొని వీడియో తీస్తున్న ప్రయాణీకుడి నుంచి మెరుపు వేగంతో ఫోన్ లాక్కున్నాడు. ఇదంతా వీడియో తీస్తున్న మరో ప్రయాణీకుడి ఫోన్‌లో రికార్డయింది. సెకనుకి పదో వంతులో జరిగిన ఈ ఘటనతో ఏం జరిగింది? ఎలా జరిగిందో అర్దం కాక బాధితుడు బిత్తరపోయాడు. ఈ అనూహ్య చోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు అంత పర్ఫెక్ట్ టైమింగ్‌తో కరెక్టుగా ఎలా పట్టావురా అంటూ షాక్ అవుతున్నారు.

 

\