క్రికెట్ గాడ్ సచిన్ తన లవ్ స్టోరీ ఏంటో మే26న ప్రేకకులకు చెప్పేయబోతున్నాడు. క్రికెట్ లో సక్సెస్ తో పాటు అంజలితో ప్రణయగాథను సినిమా రూపంలో చూపించబోతున్నాడు. తన జీవితం ఆధారంగా నిర్మిస్తున్న డాక్యూఫిల్మ్ ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ గురించి ప్రధాని నరేంద్రని కలిసి వివరించాడు
అద్భుత బ్యాటింగ్ తో క్రికెట్ ను ఓ ఊపు ఊపేసిన సచిన్ ..ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో క్రికెట్ గాడ్ అనిపించుకున్నాడు.
అతడి ఆటలో ఎంత సొగసుందో కెరీర్లోనూ అంతే వేదన ఉంది. ఫామ్ కోల్పోయిన ప్రతిసారీ విమర్శల పాలయ్యాడు. కఠోర సాధన చేసి రీ ఎంట్రీల్లో సత్తా చాటాడు. తన జీవితం ఆధారంగా వస్తున్న సినిమా ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ ద్వారా తన ప్రేమకథ గురించి అందరూ తెలుసుకుంటారని సచిన్ చెబుతున్నాడు.
ఈ సినిమాతో కెరీర్ గురించే కాకుండా తన ప్రేమ కథ గురించి కూడా తెలుసుకుంటారని సచిన్ అన్నాడు. ‘ఈ చిత్రంలో నా జీవితంలోని ప్రణయ గాథనూ మీరు చూస్తారు. నా క్రీడా ప్రస్థానాన్ని మలచడంలో నా సతీమణి (అంజలి) పాత్ర ఎంతో కీలకం’ అని సచిన్ ఓ టీవీ ఛానల్‌తో చెప్పాడు. ‘అంజలి నా కెరీర్లో సమ్మిళిత భాగం. నా జీవితంలోని అత్యుత్తమ భాగం అంజలి. ఐతే ఆమె ఎప్పుడూ నా కెరీర్లో జోక్యం చేసుకోలేదు. ఈ బయోపిక్ ద్వారా నా వ్యక్తిగత ఆలోచనలు, సంఘటనలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నా’ అని అన్నాడు. తానెప్పుడూ ఎడమ కాలికే ముందు ప్యాడ్ వేసుకొంటానని, అది తనకు సెంటిమెంట్ అన్నాడు. మే 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీని జేమ్స్ ఎర్క్సైన్ డైరెక్ట్ చేస్తే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Briefed our Hon'ble PM @narendramodi about the film #SachinABillionDreams & received his blessings. pic.twitter.com/XEwcBpKELA
— Sachin Tendulkar (@sachin_rt) May 19, 2017