సచిన్..సచిన్..నీకెవ‌రూ సాటిరారు! - MicTv.in - Telugu News
mictv telugu

సచిన్..సచిన్..నీకెవ‌రూ సాటిరారు!

May 26, 2017

సచిన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మాస్ల‌ర్ బ్లాస్ట‌ర్ జీవిత‌చ‌రిత్ర‌పై తెర‌కెక్కిన స‌చిన్‌: ఎ బిలియ‌న్ డ్రీమ్స్ శుక్రవారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైంది. థియేట‌ర్ల‌న్నీ హౌజ్‌ఫుల్ బోర్డుల‌తో కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా చూసిన సెల‌బ్రిటీలు.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో మిస్ కాకూడ‌ద‌ని టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అభిమానుల‌కు పిలుపునిచ్చాడు. మాస్ట‌ర్ గురించి ఎన్నో తెలియ‌ని విష‌యాలు, అత‌నికి ఎదురైన స‌వాళ్ల గురించి సినిమా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించింద‌ని ధోనీ చెప్పాడు. స‌చిన్.. నీకెవ‌రూ సాటిరారు అంటూ మ‌రో వ‌ర‌ల్డ్‌క‌ప్ విన్నింగ్ కెప్టెన్ క‌పిల్ దేవ్ ట్వీట్ చేశాడు.