సినిమా వాళ్ళకి...దాసరి నేర్పిన పాఠాలు గుణపాఠాలు - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా వాళ్ళకి…దాసరి నేర్పిన పాఠాలు గుణపాఠాలు

June 2, 2017

దాసరి నారాయణ రావు… ఇప్పుడీ పేరు గతమైంది కానీ సినిమాల్లోకి రావాలుకున్నవారికి చాలా పాఠాలు, గుణపాఠాలు నేర్పించి వెళ్ళింది. కేరీర్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా తనలో ఫైర్ ని ఎక్కడా తగ్గించుకోలేదు. అదే స్టామినాను కొనసాగించారు. మరి దాసరి నుంచి నేర్చకోవాల్సిన మంచేంటి ? చెడేంటి ? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన ప్రయాణాన్ని డీప్ గా పరిశీలిస్తే తెలిసిపోతుంది.
జీరో నుండి హీరోలా ( వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ) ఎదిగిన దర్శక దిగ్గజం దాసరియే అనిపిస్తుంది. తెలుగు సినిమా దర్శకుల స్థాయిని ఒక లెవల్ కు తీసుకెళ్ళారు. అప్పటివరకు డైరెక్టర్ అంటే నామమాత్రంగానే వుండేవాడు. ‘ ఇది ఫలానా హీరో సినిమా ’ అని ప్రేక్షకులు సినిమాలు చూసేవారు. కానీ దాసరి ఆ రివాజును మలిపేసి సినిమాకి ‘ డైరెక్టర్ ఈజ్ ఎ కెప్టెన్ ఆఫ్ ది ఫిల్మ్ ’ అని చెప్పాడు. ‘ ఇది ఫలానా దర్శకుడి సినిమా ’అని చూపించగలిగాడు. సినిమా పోస్టర్ మీద దర్శకుడి ఫోటో పెట్టే కొత్త కల్చర్ ని తీస్కొచ్చాడు.
చదువుకునే రోజుల నుంచే ఆయనకి సినిమా అంటే ఆసక్తి ఏర్పడింది. అలా తన కలను నిజం చేసుకునేందుకు మద్రాసు బాట పట్టారు. అక్కడ సిటీకి దూరంగా ఒక చిన్న గదిలో అద్దెకుండి సినిమా ప్రయత్నాలు చేసేవారట. సీనియర్ దర్శకులు ధవళ సత్యం ఆయన ఒకే రూమ్మేట్స్ గా ఇద్దరు కలిసే ఉప్పిడి ఉపవాసం వుంటూ ప్రతిరోజూ సైకిల్ మీద టి నగర్ వెళ్ళి సినిమా ప్రయత్నాలు చేసేవారట. హార్డ్ వర్క్, వృత్తి పట్ల అంకిత భావం, సినిమా వారందర్నీ ఒక కుటుంబంగా భావించి ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలబడటంలో దాసరి ముందుండేవారు.


చిన్న సినిమాలు రిలీజ్ కష్టమైన సందర్భాలలో వారికి అండగా నిలబడి ఆ సినిమాలు రిలీజయ్యేలా చూసుకునేవారు. తమ సినిమా ప్రమోషన్ కోసం ఏ చిన్న దర్శకుడు పిలిచినా కాదనకుండా వెళ్ళేవారు. ఇండస్ట్రీలో ఆ నలుగురి గుత్తాధిపత్యం గురించి మొట్ట మొదట ప్రశ్నించిన వ్యక్తి దాసరి. కులమతాల ప్రాతిపదికన, ప్రాంతీయ విబేధాలతో ఒక కళాకారుణ్ణి అస్సలు అంచనా వేసేవారు కాదు. అటు సినిమాలు చేస్తూనే ఇటు ఉదయం దిన పత్రికని స్థాపించి జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించారు. పర్ ఫెక్ట్ జర్నలిస్టులను అందించిన ఘనత ఉదయందే. ఆ ఉదయం వెనుకున్న సూరీడు మాత్రం దాసరియే.
తన దెగ్గర శిష్యరికం చేసే అసిస్టెంట్ దర్శకులు తప్పకుండా మంచి డైరెక్టర్లే అవుతారనడానికి కోడి రామకృష్ణ, సాగర్, ఆర్ నారాయణ మూర్తి, రేలంగి నర్సింహారావు వంటివారు నిరూపించారు. రోజుకి మూడు కాల్షీట్లలో ఉదయం ఆరు గంటలకు ఒక సినిమా షెడ్యూల్ ఆ తర్వాత మధ్యాహ్నం నుండి మరొక సినిమా, ఆ తర్వాత నైటు పన్నెండు వరకు చివరి షెడ్యూల్ తో ఆయన దినచర్య చాలా బిజీగా గడిచేది. సారధి, ఏవియం, అన్నపూర్ణ వంటి స్టూడియోల్లో షిఫ్టులు మారుతూ చాలా హార్డ్ వర్క్ చేసారు కాబట్టే నూఠా యాభై సినిమాలకు దర్శకత్వం వహించగలిగారు. అన్ని సినిమాలకు దర్శకత్వం వహించడం అనేది చిన్న విషయం కాదు. రోజుకు మూడు షిఫ్టుల్లో అలిసి పోకుండా పని చేయడమనేది ఎవరికి సాధ్యం కాకపోవచ్చు. ‘ మేఘ సందేశం, శివరంజని, ఒసేయ్ రాములమ్మ ’ వంటి ఎవర్ గ్రీన్ సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఉద్యమ పాటలను, జాన పదాలను సినిమాలకి మళ్ళించి కమర్షియలైజ్ చేసిన ఘనత తనకే దక్కుతుంది. తన చిన్న కొడుకు అరుణ్ని హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నించారు కానీ కుదరలేక పోయింది.


ఇక తనలోని మైనస్ విషయాల గురించి ప్రస్తావించుకుంటే దాసరి అంతర్లీనంగా ఒక కులం పక్షపాతిగా ముద్రపడ్డాడు. రచ్చ గెలిచిన దాసరి ఇంటి విషయానికొచ్చే సరికి చాలా లొసుగులున్నాయి. తన పెద్ద కోడలికి కొడుకు విడాకులివ్వకుండానే కుటుంబానికి దూరంగా పెట్టారు. తనకి మామగారైతేనే న్యాయం చేయగలరని ఆమె దాసరిని చాలా సార్లు కలిసినా ప్రయోజనం లేదు. తనింకా పక్షం రోజుల్లో చనిపోతాననగా ఎలాగైనా తన మనవణ్ణి హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని కోడలికి మాటిచ్చారు.. గానీ అది నెరవేరకుండానే వెళ్ళిపోయారు.


అలాగే తను బొగ్గు గనుల శాఖా మంత్రిగా వున్నప్పుడు బొగ్గు స్కాంలో క్రియాశీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసింకా కోర్టుల్లో నడస్తూనే వుంది. ఇక తనను కలిసేందుకు వచ్చిన వాళ్లను..స్టేజీలపై కాళ్ళు మొక్కించుకునే ఆచారాన్ని తీస్కొంచ్చింది దాసరి అనే పుకారు కూడా వుంది. కాస్త గౌరవంగా శిరసు వంచినవారి మెడలు వంచి మరీ కాళ్ళు మొక్కించుకునేవారనేవారట. చాలా మటుకు సినిమాను కోడైరెక్టర్ల సాయంతోనే కానిచ్చేసి తన పేరు వేసుకునేవారని, వేరే రచయితలు రాసిన డైలాగులు, పాటలు తనే రాసినట్టుగా పేరు వేస్కునేవారని కూడా విమర్శలున్నాయి. పచ్చి తాగుబోతు, మంచి భోజన ప్రియుడు కూడా అని సినిమావాళ్లు చెబుతుంటారు. తాగినప్పుడల్లా రెండేసి కిలోల చేపలు, రొయ్యలు, మటన్ బాగా తినడం వల్లే హెవీ పర్సనాలిటీ తయారైందని చెప్తారు. ఏది ఏమైనా సర్వసాధారణమైన అంతర్లీనంగా వుండే లొసుగులని పట్టించుకోకుండా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసిన మంచిని, సేవని భవిష్యత్ దర్శకులు ఆదర్శంగా తీస్కోవాలి. డబ్బు, పేరు బాగా వున్నప్పుడు దాన్ని కరెక్టుగా యూటిలైజ్ చేస్కోవాలి. ఆ విషయంలో ఆయనవి మనకు పైకి కన్పించే పాఠాలు యూజ్ ఫుల్లే.. కన్పించని గుణపాఠాలు కూడా అదుపు తప్పే న్యూకమర్ ఫిల్మ్ మేకర్స్ కి యూజ్లెస్సే…