నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో మరోసారి ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో ఉద్యోగులను తీసేసిన సిస్కో.. మరోసారి 1,100 మంది సిబ్బందిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. బుధవారం సిస్కో త్రైమాసిక ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
రిస్ట్రక్చరింగ్ ప్రణాళికలో భాగంగా 7శాతం ఉద్యోగాలను తొలగించేందుకు గతేడాది అగస్టులో సిస్కో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దశల వారీగా 5,500 మంది ఉద్యోగులను తీసేస్తామని చెప్పింది. మూడో త్రైమాసిక ఫలితాల్లో సంస్థ ఆదాయం 1శాతానికి పడిపోవడంతో ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత కొనసాగిస్తుంది.