సీఆర్పీఎఫ్‌లో 1458 పోస్టులు.. అర్హతలు, అప్లై వివరాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

సీఆర్పీఎఫ్‌లో 1458 పోస్టులు.. అర్హతలు, అప్లై వివరాలు..

December 29, 2022

CRPF Head Constable Recruitment 2023, Notification Out for 1458 Posts union government forces jobs

కేంద్ర భద్రతాబలగాలల్లో కీలకమైన సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్పీఎఫ్)లో భారీ స్థాయిలో నియమాకాలకు నోటిఫికేషన్ వెలువడింది. 1458 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో హెడ్ కానిస్టేబుల్ పోప్టులు 1315, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 143. జవనరి 4 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి రోజు జనవరి 25. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికెట్ల తనిఖీ, డీటైల్డ్ మెడికల్ టెస్ట్ వంటి పరీక్షలు జరిపింది ఎంపిక చేశారు. ఏఎస్సైలకు నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300లు, హెడ్ కానిస్టేబుళ్లకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతం ఉంటుంది.
అర్హతలు, ఫీజు..

https://s3-ap-south-1.amazonaws.com/adda247jobs-wp-assets-adda247/jobs/wp-content/uploads/sites/14/2022/12/27162639/CRPF-ADVERT.pdf

గుర్తింపు పొందిందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్మీడియట్‌, లేదా దానికి సమానమైన కోర్సులో పాసై ఉండాలి. పురుషుల ఎత్తు 165 సెంటీమీటర్లు, మహిళల ఎత్తు 155 సెంటీమీటర్లు ఉండాలి. వయసు జనవరి 25, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. రాత పరీక్ష ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉంటుంది.
పూర్తి వివరాలకు

CRPF Head Constable Recruitment 2023, Notification Out for 1458 Posts union government forces jobs
CRPF jobs, Head Constable Recruitment 2023, job Notification, 1458 Posts. union government forces jobs