Suitcases Loaded On Sri Lanka Navy Ship As President Flees
mictv telugu

సూట్‌కేసులతో పారిపోతున్న శ్రీలంక అధ్యక్షుడు.. వీడియో వైరల్‌

July 9, 2022

sri lanka president

శ్రీలంక రాజధాని కొలంబోలో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు అధ్యక్ష నివాసంలోకి చొచ్చుకెళ్లారు. ఆ భవనంలో స్విమ్మింగ్‌ పూల్‌లో నిరసనకారులు ఈత కొట్టడం, కిచెన్‌లో వంట చేసుకున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకోపక్క ఇసుకేస్తే రాలనంత జనంతో కొలంబో వీధులు నిండిపోయాయి. క్రికెటర్లు నిరసనకారులకు మద్దతుగా వచ్చారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు బస్సులు, రైళ్లు, ట్రక్కుల్లో కొలంబో చేరుకున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది కూడా వీరితో జత కలిశారు.

ఈ నేపథ్యంలో గోటబయ పరారయ్యరంటూ పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన పెద్ద పెద్ద సూట్‌కేసులు తీసుకుని శ్రీలంక నేవీ ఓడలో పారిపోయారంటూ.. వార్తలు గుప్పుమన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. భారీ ఆందోళనలు చెలరేగుతాయనే సమాచారంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రెసిడెంట్ భవనాన్ని వదిలి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు. శ్రీలంక నేవీ షిప్ లో సూట్‌కేస్‌లతో పారిపోతున్నట్లు ఈ వీడియోలో ఉంది. శ్రీలంక నేవీ షిప్ లో సూట్‌కేస్‌లు లోడ్ చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇవన్నీ అధ్యక్షుడు రాజపక్సేవే అని స్థానిక మీడియా పేర్కొంది. విజువల్స్ లో ముగ్గురు వ్యక్తులు పెద్ద సూట్‌కేస్‌లను శ్రీలంక నేవీ షిప్ గజబాహు ఓడలో తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు సూట్‌కేస్‌లను పట్టుకుని హడావుడిగా పరిగెత్తడం ఇందులో కనిపిస్తోంది. శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థలు పరారవుతున్నది అధ్యక్షుడేనంటూ … వార్తలు ప్రసారం చేశాయి. కానీ గోటబయ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారో లేదా అనేది స్పష్టం కాలేదు.

Suitcases Loaded On Sri Lanka Navy Ship As President Flees