స్పైడర్ మ్యాన్ స్టంట్‌లో అపశృతి.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

స్పైడర్ మ్యాన్ స్టంట్‌లో అపశృతి.. వీడియో వైరల్

June 13, 2022

స్పైడర్ మ్యాన్ స్టంట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు ‘నీకూ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయి’ అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది షాక్‌కు గురై ‘బతికిండ, చచ్చిండ’ అంటూ అయోమయానికి గురౌతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని డిస్నీ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్‌లో స్పైడర్ మ్యాన్ తాడు సహాయంతో ఎగిరి, పల్టీలు కొడుతూ ల్యాండ్ అవ్వాల్సిన సమయంలో జారి కింద పడిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, దానిని చూసిన యువత, ప్రజలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో ఉన్నది మనిషే అనుకున్నారు. కానీ, ఆ డ్రెస్‌లో ఉన్నది మనిషి కాదట అది స్పైడర్ మ్యాన్ రోబోనట. దాంతో ప్రజలు ఒక్కసారిగా ఊపరిపీల్చుకుంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Darren L. (@mdglee_szm)

మరోపక్క ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సినిమాలు ఎంతంటి విజాయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన ప్రతి యువకుడు అతనిలాగా తయారు కావాలని కళలు కంటారు. తాజాగా రిలీజ్ అయిన `స్పైడర్ మ్యాన్: నో వే హోమ్` కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 16న యూఎస్ కంటే ఒక రోజు ముందే భారత్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. అంచనాల‌కు త‌గ్గ‌ట్టే సినిమా ఉండడంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తూ, సినిమాను వీక్షిస్తున్నారు.