Home > Featured > హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జీలు..

హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జీలు..

Telangana High..

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు. అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, కుమారు లక్ష్మణ్‌, తడకమళ్ల వినోద్‌కుమార్‌లను జడ్జిలుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ టిబి రాధాకృష్ణన్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉమ్మడి హైకోర్టును విభజించి రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగానే ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది, తెలంగాణకు పది మంది చొప్పున న్యాయమూర్తులను కేటాయించారు.

త్వరలోనే మరో ముగ్గురు న్యాయమూర్తులు కూడా తెలంగాణ హైకోర్టుకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదం కోసం గతేడాది పంపారు. ప్రస్తుతం వీరు ముగ్గురితో కలిపి తెలంగాణ హైకోర్టుకు మొత్తం పదహారు మంది న్యాయమూర్తులు పనిచేస్తారు.

Updated : 23 Aug 2019 11:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top