హైదరాబాద్ వస్తున్న చేగువేరా కుమార్తె.. రెండు పార్టీలకు దూరం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ వస్తున్న చేగువేరా కుమార్తె.. రెండు పార్టీలకు దూరం

January 12, 2023

Cheguvera's daughter is coming to Hyderabad on January 22

క్యూబా విముక్తి పోరాట యోధుడు, ప్రసిద్ధి గాంచిన విప్లవ కారుడు చేగువేరా కుమార్తె ఆలైదా గువేరా హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 22న నగరానికి వస్తున్నట్టు సీపీఐ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సభకు బీజేపీ, ఎంఐఎం పార్టీలను మినహాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.