గ్యాస్ పైప్‌లైన్ పేలి 9 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గ్యాస్ పైప్‌లైన్ పేలి 9 మంది మృతి

October 9, 2018

ఛత్తీస్‌గడ్‌లోని భిలాయి స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కావడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో  9 మంది మృతిచెందగా, మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంట్‌లోని కోక్ ఒవెన్ సెక్షన్‌లో గ్యాస్ లైన్ లీకేజీ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే  ఆస్పత్రిలో చేర్చారు. అందులో తొమ్మది మంది చికిత్స పొందుతూ మృతి చెందారు.

Bhilai Steel Plant blast

ఈ ప్లాంట్‌లో 2014లో కూడా భారీ ప్రమాదం  జరిగింది. అప్పుడు ఇద్దరు సినీయర్ అధికారులు మృతి చెందారు.  వాటర్ పంప్ హౌస్ బ్రేక్‌డౌన్ కావడంతో కార్బన్ మోనోక్సైడ్ విషవాయివు లీకయింది. దేశంలోనే ఉత్తమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గా భిలాయ్ స్టీల్ ప్లాంట్ 11 సార్లు ప్రధాని ట్రోఫీని గెలుచుకున్న ఈ ప్లాంట్‌, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎఐఎల్) ఆదీనంలో ఉంది.