గ్రూప్-1కు 1.05 లక్షల దరఖాస్తులు - MicTv.in - Telugu News
mictv telugu

గ్రూప్-1కు 1.05 లక్షల దరఖాస్తులు

May 15, 2022

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2వ తేదీన గ్రూప్ 1కు ఆల్‌‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటిసారిగా తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు ప్రకటన విడుదల కావడంతో అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఈనెల 30న గడువు ముగియనుంది. ఈ క్రమంలో 2,28,088 మంది ఓటీఆర్‌లో మార్పులు చేసుకొగా, కొత్తగా 1,08,423 మంది ఓటీఆర్ నమోదు చేసుకొన్నట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.

మరోపక్క పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటివరకూ దాదాపు 4.5 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈసారి పోలీసు ఉద్యోగాలకు తెలంగాణ వ్యాప్తంగా లక్షమంది మహిళలు ఆప్లై చేసినట్లు అధికారులు వివరాలను వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు ఈనెల 20తో గడువు ముగయనుంది. ఈ క్రమంలో నిరుద్యోగులు ఈసారి ఉద్యోగాన్ని సాధించాలన్న కసితో గ్రూప్1, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.