1.5 billion dollar cruise ship to be scrapped after company filed for bankruptcy
mictv telugu

11 వేల కోట్లతో నిర్మించి.. ఒక్కసారి కూడా వాడకుండానే తుక్కుతుక్కు

September 19, 2022

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణ నౌకల్లో ఒకటిగా నిర్మాణమవుతున్న ‘గ్లోబల్ డ్రీమ్’ త్వరలో ముక్కలు కాబోతుంది. వేలకోట్లతో నిర్మిస్తున్న ఈ నౌక.. పూజకు పనికి రాని పువ్వుగా.. ఒక్కసారి కూడా సముద్రయానం చేయకుండానే తుక్కుగా మారబోతుంది. అత్యాధునిక సౌకర్యాలతో, అందంగా నిర్మిస్తున్న ఈ నౌకలో ఒకేసారి 9,000 మంది ప్రయాణించే వీలున్నా.. ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకుండానే, ‘గ్లోబల్ డ్రీమ్’ తుప్పుగా మారబోతుంది. ఈ నౌకను తయారు చేస్తున్న జర్మనీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ సంస్థ దీని తయారీ కారణంగా ఆర్థిక నష్టాలలో ఉంది. ఈ నౌక నిర్మాణమే ఒక సంచలనంగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఇప్పుడు ఎందుకు పనికి రాకపోవడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.

ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా తయారుచేసిన ఈ నౌకలో ఆధునిక వసతులు ఎన్నో ఉన్నాయి.ఓపెన్ ఏరియా స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్, ఇతర లగ్జరీ సౌకర్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ నౌక బరువు 2,08000 టన్నులు.ఈ నౌక నిర్మాణానికి ఆ జర్మనీ కి చెందిన సంస్థ కి దాదాపు 11 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.ఇప్పటికే 100% తయారీ పూర్తి అయినా ఈ నౌక కోసం 8313 కోట్లు ఖర్చు చేసింది ఆ సంస్థ.ఈ సంస్థ దివాలా తీయడం వలన ఈ నౌకను ఎవరికైనా అమ్మేయాలి అని చూసినా దీనికోసం ఎవరు ముందుకు రావడం లేదు. ఇంత పెద్ద నౌకను ముక్కలు ముక్కలుగా కట్ చేసి అమ్ముకొని నష్టాలలో కొంతమేరకు తగ్గించుకోవాలని ఆ సంస్ధ భావిస్తుంది.