1.9 crores to the person who sweeps the streets
mictv telugu

వీధులు ఊడ్చే వ్యక్తికి రూ.1.9 కోట్లు..కోర్టుకెక్కిన స్నేహితుడు

July 8, 2022

 

ఓ మిలియనీర్‌‌కు, వీధులు ఊడ్చే వ్యక్తికి మధ్య ఏర్పడిన స్నేహం..1.9 కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చే స్థాయికి చేరి, చివరికి కోర్టు మెట్లు ఎక్కిన సంఘటన బ్రిటన్ దేశంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బ్రిటన్‌కు చెందిన జాన్‌ రాంకిన్‌ కార్న్‌ఫోర్త్‌ అనే వ్యక్తి 1979లో ఓ న్యూఇయర్‌ పార్టీలో సిమోన్‌ డెనియర్‌ అనే వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి ఓ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. అంతేకాదు, సిమోన్ డెనియర్.. వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగించేవాడు. జాన్‌ రాంకిన్‌, డెనియర్‌‌లు కలిసి వారంలో అనేకసార్లు మద్యం సేవించేవారు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతులేని స్నేహం ఏర్పడింది.

ఇంతలోనే జాన్‌ రాంకిన్‌ తండ్రి మరణించాడు. తండ్రి మరణించడంతో ఆస్తి జాన్‌ రాంకిన్‌ చెందింది. దాంతో అతడు కొన్ని మిలియన్ల పౌండ్లను పొందాడు. అందులోంచి సుమారు 2 లక్షల పౌండ్లను తన నిరుపేద స్నేహితుడైన సిమోన్‌ డెనియర్‌కు..విడాకుల ఖర్చు కోసం 2012లో 26,300 పౌండ్లు, 2013లో 50వేల పౌండ్లు, 2014లో 1.25 లక్షల పౌండ్లను మూడు దఫాలుగా ఇచ్చాడు. అయితే, ఎన్ని రోజులైన తన సొమ్మును తిరిగి స్నేహితుడు చెల్లించకపోవటంతో సిమోన్‌ డెనియర్‌పై జాన్‌ రాంకిన్‌ కోర్టులో ఫిర్యాదు చేశాడు.

కోర్టులో డెనియర్‌ మాట్లాడుతూ.. ”1.25 లక్షల పౌండ్లు నా స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చాడని చెప్పాడు. నా మాజీ భార్యకు భరణం ఇచ్చేందుకు తీసుకున్న డబ్బులు రుణంగానే తీసుకున్నాను. వాటిని తిరిగి చెల్లించాను.” అని సిటీ కౌంటీ కోర్టులో అతడు ఒప్పుకున్నాడు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి స్టిఫెన్‌ హెల్‌మ్యాన్‌.. ఇంటి కోసం ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు సైతం రుణమేనని, తిరిగి చెల్లించాల్సిందేనిని తీర్పు ఇచ్చారు. కానుకగా ఇచ్చాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇంటి రుణంతో పాటు దానికి వడ్డీ చెల్లించాలని, విడాకుల కోసం ఇచ్చిన వాటికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది.