కోటి దాటిన మన బతుకమ్మ పాట - MicTv.in - Telugu News
mictv telugu

కోటి దాటిన మన బతుకమ్మ పాట

October 23, 2017


మైక్ టీవీ బతుకమ్మ పాటను మీ ముందుకు తీసుకొచ్చి సరిగ్గా నెల రోజులైంది.  ఒక్క నెలలోనే కోటీ వ్యూస్‌ను అందించిన మీకు శతకోటి వందనాలు. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకు కొన్ని వందల పాటలు వచ్చాయి. ఎన్నొచ్చినా మైక్ టీవీ బతుకమ్మ పాటను మీరందరూ ఆదరించారు. మా పాట మీ అందరి మనసులు గెలుచుకుంది, మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం.  నో నాయిస్, ఓన్లీ వాయిస్ అంటూ మేము, మీ ముందుకచ్చిన అతి తక్కువ కాలంలోనే, మాగొంతును, మీ అందరి గొంతుల్లో వింటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కొన్ని కోట్ల మంది అభిమానం, మా అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది, మీమనసు గెలుచుకునేందుకు కొత్త దారి చూపింది. ఇంకా ముందు ముందు ఇలాగే  మీ కనులకు ఇంపుగా, మీ చెవులకు విన సొంపుగా  మంచి, మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొస్తాం.  మైక్ టీవీని ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు.