1 lakh Indians became permanent residents of Canada last year, says survey data
mictv telugu

కెనడాలో మనదే హవా.. మామూలుగా ఉండదు మరీ..

November 8, 2022

1 lakh Indians became permanent residents of Canada last year, says survey data

విద్య, ఉద్యోగావకాశాల కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ యువతకి.. కెనడా అధిక సంఖ్యలో ఆహ్వానం పలుకుతోంది. ప్రతియేటా 5లక్షల మంది వలసదారులను అనుమతిస్తామని ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది కూడా. కొత్తగా ఆ దేశానికి చేరిన వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62శాతం మంది ఉంటే.. వారిలో భారతీయులే అధికమని కెనడా సెన్సస్ రిపోర్టు-2021 వెల్లడించింది. భారత్ ఏకంగా 18.6శాతం వలసలతో మొదటి స్థానంలో ఉందని ఈ నివేదిక పేర్కొంది. కాగా, 2021లో కెనడా ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 4,05,000 మంది కొత్త వలసదారులను ఆహ్వానించింది. దీంతో సుమారు 1లక్ష మంది భారతీయులు శాశ్వత నివాస హోదాను పొందినట్లు తాజాగా ఆ దేశ జాతీయ గణాంక సంస్థ విడుదల చేసిన కొత్త సర్వే రిపోర్ట్ తెలిపింది.

కార్మికుల కొరతతో సతమతమవుతున్న కెనడా భారీ మొత్తంలో వలసలను ప్రోత్సహిస్తోంది. గడిచిన ఐదేళ్లలో కెనడా వలస వెళ్లేవారిలో దాదాపు 70.7శాతం మంది విదేశీయులు ఉపాధిని కలిగి ఉన్నారట. అత్యధికంగా అంటారియో, క్యూబెక్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపం, న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్, సస్కట్చేవాన్, మానిటోబాలో ప్రాంతాల్లో ప్రవాసులు భారీ మొత్తంలో ఉపాధి పొందుతున్నారని రిపోర్ట్ పేర్కొంది. ఇక భారతీయులైతే అంటారియో, బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లలో ఉన్నారట. ఆ తర్వాత అల్బెర్టా, క్యూబెక్‌లలో కూడా మన కమ్యూనిటీలు పెరుగుతన్నాయట.