కళ్లు లేకున్నా.. మన కళ్లను మరింత పెద్దవి చేస్తాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

కళ్లు లేకున్నా.. మన కళ్లను మరింత పెద్దవి చేస్తాడు..

October 15, 2019

వికలాంగులు, అంధులను చూస్తే సాధారణంగా ఎవరికైనా జాలి కలుగుతుంది. అయ్యో దేవుడా వారికి ఇలాంటి పరిస్థితి ఎందుకు కల్పించావని సానుభూతి వ్యక్తం చేస్తారు. కానీ కొందరు వైకల్యాన్ని అధిగమించి చేసే అద్భుతాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి. అలాంటి వాళ్లలో అమెరికాకు చెందిన జార్జ్‌ రెడ్‌హాక్ ఒకరు. అంధత్వం కళ్లకే తప్ప మనస్సుకు, మెదడు, సృజనాత్మకతకు కాదని నిరూపించారు. 

  GIFs  .

జార్జ్ కళ్లతో చూడలేకపోయినా.. అందరినీ అబ్బుర పరిచేలా యానిమేషన్ చిత్రాలను రూపొందించగలరు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఆయన రూపొందించిన అద్భుతమైన జిఫ్‌ డిజైన్లు ఎందరినో ఆకట్టుకున్నాయి. దృష్టి లోపంతో తనలో కలిగిన గందరగోళానికి తన చిత్రాలే ఓ కళాత్మక రూపమని జార్జ్ చెబుతుంటారు. పుట్టుకతో అంధుడు కానప్పటికీ ఓ ప్రమాదంలో జార్జ్ చూపును కోల్పోయారు. అయితే, తన మెదడులో నిక్షిప్తమైన ఊహలను కంప్యూటర్‌ సాయంతో చిత్రిక  పడుతుంటారు వాటికి గ్రాఫిక్స్ జత చేసి అద్భుతంగా రూపొందిస్తారు. అలా రూపొందించిన యానిమేషన్‌ చిత్రాలు, పెయింటింగ్‌లు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మీరూ చూసేయండి మరి..