బాలికల హాస్టల్‌లోకి 10 మంది యువకులు..బిర్యానీ వండుకొని పార్టీ  - MicTv.in - Telugu News
mictv telugu

బాలికల హాస్టల్‌లోకి 10 మంది యువకులు..బిర్యానీ వండుకొని పార్టీ 

February 24, 2020

10 Boys Enter Into Womens Hostel     

నూజివీడు ట్రిపుల్ ఐటీ లేడీస్ హాస్టల్‌లోకి ఓ యువకుడు చొరబడి రోజంతా అక్కడే గడిపిన సంగతి మర్చిపోకముందే కృష్ణా జిల్లాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. లేడీస్ హాస్టల్‌లోకి వెళ్లిన 10 మంది యువకులు బర్త్‌డే పార్టీ చేసుకొని బిర్యానీ తిన్నట్టుగా వెల్లడైంది. నేరుగా హాస్టల్ కిచెన్‌లోకి వెళ్లి స్వయంగా వంట చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ సమయంలో హాస్టల్‌లో వార్డెన్ లేకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ముస్తాఖాన్‌పేటలోని ఇంటిగ్రేటెడ్‌ బాలుర హాస్టల్‌లో సహాయకురాలుగా పనిచేసే మహిళ తన కొడుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు బుచ్చుపేటలోని ఎస్సీ బాలికల వసతి గృహం వద్దకు తీసుకెళ్లింది. తన కొడుకు, కూతురు, మరో 10 మంది యువకులు బాలికల హాస్టల్‌కు చేరుకున్నారు. వారంతా కలిసి అక్కడే బిర్యానీ చేసుకొని తిన్నారు. దీనిపై హాస్టల్‌లో ఉన్న మిగితా బాలికలు అభ్యంతరం చెప్పారు. అయినా వినిపించుకోకుండా యువకులు చొరబడటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని  వార్డెన్‌ బేగంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థి, రాజకీయ పార్టీల నేతలు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.