విజయ్ నిర్మాత ఇంట్లోకట్టలపాములు..10 బ్యాగుల్లో డబ్బు - MicTv.in - Telugu News
mictv telugu

 విజయ్ నిర్మాత ఇంట్లోకట్టలపాములు..10 బ్యాగుల్లో డబ్బు

February 6, 2020

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలపై ఐటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో ఉన్న నటుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తమిళ సినిమా హీరో విజయ్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు సంచలనం రేపాయి. బుధవారం నుంచి  రెండు రోజులు పాటు అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. బిగిల్ సినిమా నిర్మాత ఇంట్లో ఉన్న 10 బ్యాగుల్లో దాచి ఉంచిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 65 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

ఇటీవల విజయ్ తీసిన బిగిల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీని ద్వారా రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు వసూలు చేసింది. తర్వాత ఆయన ఆస్తులపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు.ఆయన ఇళ్లు, బిగిల్ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్ కార్యాలయాలలో సోదాలు చేశారు. ఆయన ఇంట్లో బ్యాగుల్లో దాచిన డబ్బుతో పాటు విలువైన బంగారంతో స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా లెక్కతేలలేదని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం విజయ్ రూ. 50 కోట్ల పారితోషికం తీసుకోగా. నిర్మాత ఇంట్లో ఇంత పెద్ద ఎత్తున సొమ్ము బయటపడటం కలకలం రేపింది.