10 gold mines ready for sale in AP..this month itself
mictv telugu

ఏపీలో అమ్మకానికి సిద్దమైన 10 బంగారు గనులు..ఈ నెలలోనే

August 15, 2022

10 gold mines ready for sale in AP..this month itself

ఆంధ్రప్రదేశ్‌లో 10 బంగారు గనులు అమ్మకానికి సిద్దమైయ్యాయి. అందులో రామగిరి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి సౌత్‌ బ్లాక్‌, జవకుల-ఎ, జవకుల-బి, జవకుల-సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్‌ బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదింటికి 29న అధికారులు వేలం నిర్వహించనున్నారు. అలాగే, యూపీలోని మూడు గనులు అయిన.. సోనాపహాడి బ్లాక్‌, సోనాభద్రలోని ధ్రువ-బైదానంద్‌ బ్లాక్‌లకు కూడా అధికారులు వేలం నిర్వహించనున్నారు. కానీ, ఎప్పుడు వేలం వేస్తారు అనే తేదీని మాత్రం వెల్లడించలేదు.

అయితే, ఈ బంగారు గనులను అధికారులు ఎందుకు అమ్ముతున్నారు? వేలం వేయడానికి కారణాలు ఏంటీ? అనే విషయాలను వెల్లడించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మైనింగ్ రంగం వాటా పెంచాలని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 13 బంగారు గనులను విక్రయించాలని నిర్ణయించింది. ప్రభుత్వం విక్రయించనున్న గనుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 గనులు ఉండగా, మిగతా మూడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. గనుల కొనుగోలుకు సంబంధించి ఆసక్తిగల వారి నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ, మార్చి 21న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2015లో గనుల చట్టాన్ని సవరించడం ద్వారా గనుల వేలం ప్రక్రియకు రాష్ట్రాలు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా 199 మినరల్ బ్లాక్‌లు వేలం వేశాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ 45 మినరల్ బ్లాక్‌లు విక్రయించాయి. ఇప్పుడు 13 బంగారు గనులను విక్రయించడం ద్వారా జీడీపీలో మైనింగ్ రంగం వాటా పెంచాలని కేంద్రం నిర్ణయించింది.” అని పేర్కొన్నారు.

అయితే, ఈ రేసులో మొదట ఉన్న రాష్ట్రాలు ఆదాయాల వాటా విషయంలో సంతోషంగా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినరల్స్‌ (ఎవిడెన్స్‌ ఆఫ్‌ మినరల్‌ కంటెంట్స్‌) రూల్స్, 2015 (ఎంఈఎంసీ రూల్స్‌), మినరల్స్‌ (ఆక్షన్‌) రూల్స్, 2015 (ఆక్షన్‌ రూల్స్‌)ను సవరించడానికి పలు నిబంధనలను నోటిఫై చేసినట్లు తెలిపింది. ఖనిజాల వేలం నిబంధనలలో సవరణలు పోటీని ప్రోత్సహిస్తాయని, తద్వారా బ్లాక్‌ల విక్రయంలో మరింత భాగస్వామ్యానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.