రోజూ రాత్రి 10 కి.మిల పరుగు.. ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

రోజూ రాత్రి 10 కి.మిల పరుగు.. ఎందుకంటే?

March 21, 2022

 

resave

దేశ రాజధాని ఢీల్లీ సమీపంలోని నోయిడాలో అర్ధరాత్రి 12 గంటలకు ఓ 19 ఏళ్ల యువకుడు భుజానికి బ్యాగ్ తగిలించుకుని, రోడ్డుపై వేగంగా పరిగెడుతున్న ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఎందుకిలా పరిగెడుతున్నావు అని పలువురు అడిగిన ప్రశ్నలకు ఆ యువకుడు చెప్పిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరి ఎవరు ఆ యువకుడు? ఎందుకు అలా పరిగెడుతున్నాడు? అసలు కారణాలు ఏమిటీ? అనే వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా ప్రాంతానికి చెందిన ప్రదీప్ మెహ్రాదికి 19 ఏళ్లు. ఆ యువకుడు నోయిడాలో తన సోదరుడితో కలిసి ఉంటున్నాడు. అంతేకాకుండా అక్కడున్న ఓ మెక్ డోనాల్డ్స్‌లో పనిచేస్తున్నాడు.

అయితే, అటుగా వెళ్తున్న బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి ఆ యువకుడిని చూసి.. ‘అయ్యో ఏదో సమస్యలో ఉన్నట్లున్నావ్.. లిఫ్ట్ ఇవ్వనా’ అని అడిగాడు. దాంతో ఆ యువకుడు సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకు అని అడిగితే, తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తను పని చేసే స్టోర్ నుంచి ఇంటికి 10 కిలోమీటర్ల దూరం. రోజూ విధులు ముగించుకున్న తర్వాత అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాను అన్నాడు. శనివారం అర్ధరాత్రి అలా పరిగెడుతూ వెళోన్న ప్రదీప్.. దర్శకుడు వినోద్ కాప్రి కంటపడ్డాడు. వినోద్ కారును స్లో చేసి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. ఇందుకు ఆ యువకుడు తనకు లిఫ్ట్ వద్దని, రోజూ ఇలాగే పరిగెడుతానని అన్నాడు. దీంతో ఆయన ఆశ్చర్యపడ్డాడు.